ప్రజాశక్తి -బాపట్ల జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో ఎఆర్ సిబ్బంది పాత్ర కీలకమని ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన డీ మొబ లైజేషన్ ముగింపు కార్యక్రమంలో ఎస్‌పి పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంలో పోలీసు బలగాల ప్లటూన్లను ఎస్‌పి పరిశీలించారు. ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ మరియు బ్యాండ్ ను చాలా చక్కగా ప్రదర్శించారని సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్ట మొదటి మొబలైజేషన్ కార్యక్రమమని తెలిపారు. జిల్లాలో పూర్తిస్థాయిలో సాయుధ బలగాలు ఉన్నాయన్నారు. ఈనెల 6 నుంచి 22 వరకూ ప్రతి ప్లటున్ లో 40 మంది చొప్పున 8 ప్లటున్ లతో మొగలైజేషన్ నిర్వహిం చినట్లు తెలిపారు. ఈ సందర్బ:గా పెరేడ్ కమాండర్ ఆర్‌ఐ ఎల్.మన్మధ రావును ఎస్‌పి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి పి.మహేష్ , ఎఆర్ డిఎస్‌పి ప్రేమ్ కుమార్, బాపట్ల డిఎస్‌పి ఎ.శ్రీనివాస రావు , డిఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఎ. శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్‌ఐ బి. శ్రీకాంత్ నాయక్ , బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.కష్ణయ్య పాల్గొన్నారు.










