మంగళగిరి: ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ టాటా మ్యాజిక్ యూని యన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పతాకాన్ని జి.నవీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ జిల్లా కార్యదర్శి నన్న పనేని శివాజీ, సిఐటియు జిల్లా జిల్లా ఉపా ధ్యక్షులు ఎస్‌ఎస్ చంగయ్య మాట్లాడుతూ ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడ రేషన్ ఏర్పాటై యాబై ఏళ్లు అయిన సంద ర్భంగా రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని అన్నారు. నిరంతరం ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పాటైన దగ్గర నుండి డ్రైవర్ల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని అన్నారు. గతంలో మోటార్ వాహనాల చట్ట సవరణ వ్యతి రేకిస్తూ దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు జాతీయ సమ్మెలు నిర్వహించిందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహనాల కార్మికులపై అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు పెంచారని విమర్శించారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరు ద్యోగులుగా ఉన్న అనేకమంది డ్రైవర్లుగా, క్లీనర్లుగా రవాణా రంగాన్ని ఉపాధిగా ఎంచుకున్నారని, ఉపాధి కల్పిం చాల్సిన ప్రభుత్వాలే మోటార్ వాహనాలపై పన్నుల భారాలు వేయడం దారుణమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్, పెనాల్టీలు పెరగడం, నూతన చట్టాలు, బాడుగలు లేక ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక రవాణా కార్మికులు అనేక ఇబ్బం దులు పడుతున్నారని తెలిపారు. ఈ క్రమం లో మోటారు వాహనాల కార్మికులకు అం డగా ఉండి నిరంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండి యా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటాలు చేస్తోందని చెప్పారు. కార్య క్రమంలో సిఐటియు మంగళగిరి పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, యూనియన్ నాయకులు టి ఏడుకొండలు, అబ్దుల్ సత్తార్, రామకృష్ణ, రాము పాల్గొన్నారు. పెదకాకాని: శంకర్ కంటి హాస్పిటల్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పతా కాన్ని కె.గోపి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడారు. కార్య క్రమంలో వి.యేసు, టి.నాగయ్య, కె. కిరణ్, టి.శివయ్య, సుబ్బారావు, కె . పూరా ్ణరెడ్డి, కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రం గాన్ని నిర్వీర్యం చేసిందని సిఐటియు తాడే పల్లి మండల నాయకులు దొంతిరెడ్డి వెం కటరెడ్డి అన్నారు. ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి జాతీయ రహదారి ఆటో స్టాండ్ వద్ద ఉన్న ఎఆర్ టి ఎఫ్ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎన్నడు లేని విధంగా తొమ్మిదేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విప రీతంగా పెంచిందన్నారు. దీని వలన రవాణా రంగంలో ఇబ్బందులు ఎదుర్కొని మోటార్ వాహనదారులు వాహనాలను రోడ్డుపై నడిపే పరిస్థితి లేదన్నారు. లారీలు, ఆటోలు,ట్రక్కులు నడిపే ఓనర్లు, డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించిందన్నారు. కార్మిక చట్టా లను బిజెపి ప్రభుత్వం మార్చివేసి కార్మికుల పొట్ట కొట్టేందుకు చట్టాలు చేయడం దుర్మా ర్గమన్నారు. ఆటోడ్రైవర్లు రోడు ్డపైకి వెళితే టాక్స్‌ల రూపంలో భరణి ఎదు ర్కొంటున్నా రని అన్నారు. కార్యక్రమంలో రైతు సం ఘం తాడేపల్లి మండల కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు,రైతు నాయకులు ఎ.రంగారావు, ఆటో డ్రైవర్లు బి.శంకర రావు, కె.సుబ్బారావు,సాంబయ్య, శ్రీను తది తరులు పాల్గొన్నారు.










