Nov 07,2023 01:12

సెలూన్‌లో ఎమ్‌డి అబ్బాస్‌తో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్‌ ఆచారి తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు : బ్రాడీపేట 1/18లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎ1 అబ్బాస్‌ స్టూడియో యూనిసెక్స్‌ హెయిర్‌ సెలూన్‌ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ1 బేకరీ వరల్డ్‌ మాదిరే ఈ సెలూన్‌ కూడా విజయవంతంగా సాగాలని, యువత ఆభిమానాన్ని సంపాదించాలని ఆకాంక్షించారు. ప్రొప్రైటర్‌ ఎమ్‌డి అబ్బాస్‌ మాట్లాడుతూ యువతీ, యువకులకు నచ్చేలా సేవలు అందిస్తామని, అందరికీ అందుబాటు ధరల్లోనే నూతన ట్రెండ్స్‌కు అనుగుణంగా హెయిర్‌ డ్రస్‌ మోడల్స్‌ను చేస్తామని చెప్పారు. తమ సేవలను యువతతోపాటు మహిళలు, పురుషులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), వైసిపి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పి.చైతన్య, ఆలియా, రవీంద్ర పాల్గొన్నారు.