Aug 23,2023 23:57

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గురజాల డిఎస్పి ఎ.పల్లపు రాజు

ంంటచింతల: బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం, భారత శిక్షా స్మృతి మాత్రమే అమలులో ఉన్నాయని, యూనిఫారం ధరించిన పోలీసుల దృష్టిలో అంతా ఒకటేనని, తాము ఏ వర్గానికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదని గురజాల డిఎస్పి పల్లపురాజు అన్నారు.బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న రెంటాలలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు పేరం జగ్గారెడ్డి మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావిస్తూ, మాచర్ల టిడిపి ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 18 వాహ నాలతో కాన్వారుగా రావడంతో పొలిమేరలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆరోజు సాయంత్రం అయ్యేసరికి గొడవలు జరిగాయని, గురజాల పోలీసులు బాధితుడు సర్వారెడ్డికి రక్షణ కల్పించి, అతని ఫిర్యాదు మేరకు ఆరు గురుపై కేసులు నమోదు చేశామన్నారు. సర్వారెడ్డి భార్య అన్నపూర్ణమ్మ తమకు కేసులు వద్దని, అందరం బంధువుల మవుతామని చెప్పారని, రాజీ చేయాలని వారు కోరగా లోక్‌ అదాలత్‌లో పెట్టి సఖ్యతగా పరిష్కరించకుంటున్నామన్నారని చెప్పారు. అంతేగాని, ఈ వ్యవహారంలో పోలీసుల బల వంతం ఏమీ లేదని డిఎస్‌పి స్పష్టం చేశారు. పోలీసు అధి కారుల సమక్షంలో కేసులకు సంబంధించి రాజీ కుదిర్చాము అనే ప్రకటన సత్య దూరం అని, బాధిత కుటుంబాల వారు దాడులు చేసిన వారు రాజకీ వస్తే తాము చేయగలిగింది ఏమీ లేదు లోక్‌ అదాలతో పెట్టి రాజీ చేస్తామని అన్నారు. పత్రి కలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, అయితే వార్తలు రాసే ముందు తమ వివరణ తీసుకుంటే బాగుండేదని డిఎస్‌పి అభిప్రాయపడ్డారు. వందమంది అల్లరి మూకలు రెచ్చిపోయి హింసకు పాల్పడితే పది మంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడ తారని, అదే వెయ్యి మంది దౌర్జన్యం చేస్తే ఉన్న కొద్ది మంది పోలీసులు సంయమనం పాటిస్తారని, ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. గత నెల పదిన ఉప్పలపాడు నర్సరీలో గడ్డి మందు చల్లి నర్సరీకి నష్టం చేసిన ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. సర్వారెడ్డితో పాటు వెన్న శ్రీనివాస్‌ రెడ్డి నిందితుడని చెప్పారు. సమా వేశంలో సిఐ దార్ల జయకుమార్‌, ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌ కుమార్‌ పాల్గొన్నారు.