Sep 30,2023 15:18
  • ఆచంటలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహారాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ వరప్రసాద్.

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డిప్యూటీ డిఎంహెచ్వో వరప్రసాద్ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆచంట రామేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంపూర్ణ పోషణ ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంగనవాడి కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యశరణ రూపొందిస్తూ అమలుపరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన సంపూర్ణ పోషణ ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట సరోజిని వెంకటేశ్వరరావు, నాయకులు పిచ్చెట్టి సత్యనారాయణ అప్పారావు అంగన్వాడీ కార్యకర్త వైట్ల ఉషారాణి, గుత్తుల శ్రీదేవి తదితరులు ఉన్నారు.