- ఆధ్వాన పారిశుధ్య o
- పట్టణంలోని 23వ వార్డులో తప్పని తిప్పలు
ప్రజాశక్తి-రామచంద్రపురం : ఏ చిన్నపాటి వర్షం వచ్చిన పట్టణంలోని 23వ వార్డులో డ్రైనేజీలన్ని పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి రావడంతో ప్రయాణికులు ప్రజలు పలు ఇక్కట్లు కు గురవుతున్నారు. ఇప్పటికి అయిదేళ్లుగా పడై పోయిన రోడ్లపైకి డ్రైనేజీ లోని బురద నీరు వచ్చి చేరడంతో ఈ నీరు ఎటు కదలక దుర్వాసన వేదజల్లడం తో ఇ క్కడ నివసించే ప్రజలను తీవ్ర ఇక్కట్లుకు గురిచేస్తుంది. దీనికి తోడు ఈ వార్డులో పారిశుధ్యం మరింత అద్వాన్నంగా ఉంది అక్కడే ఉండిపోవడంతో అది కుళ్ళి డ్రైనేజీ నీటిలో కలిసి మరింత ధర్భరంగా తయారైంది. ఈ చెత్త డ్రైనేజీ నీటిలో పందుల సంచారం కూడా అధికం కావడంతో ఇక్కడ సమస్యలు తీర్చే నాధుడే లేడా అని పట్టణవాసులు 23 వ వార్డు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని రోడ్ల సమస్య పరిష్కరిస్తామని పారిశుధ్యం సమస్య పరిష్కరిస్తామని హామీలు అయితే ఇస్తున్నారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడంతో పరిసర ప్రాంత నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి లోతట్టు ప్రాంతమైన 23వ వార్డులోని రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.










