Oct 16,2023 12:03
  •  తీవ్ర ఇబ్బందుల్లో వ్యాపారులు, స్థానిక ప్రజలు 

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ ఆవరణంలో కుతలేరు కొత్త వంతెన ఏర్పాటు పనుల్లో భాగంగా అక్రమ కట్టడాలన్నీ కూల్చివేశారు. దీంతో గత వారం రోజుల నుండి ఆ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువలు పూర్తిగా మన్ను రాళ్లతో నిండిపోయి బ్లాక్ కావడంతో స్థానిక సంత మార్కెట్ కు వెళ్లే దారిలో సుమారు రెండు అడుగుల వరకు డ్రైనేజీ నీరు నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలతో పాటు ఆ ప్రాంతంలో కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక వర్తకులు వివిధ వస్తువులు కొనడానికి వచ్చే వినియోగదారులు అదేవిధంగా సంత మార్కెట్ వైపు నుండి బస్టాండ్ కు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దానికి తోడు ఆ ప్రాంతం మొత్తం దుర్వాసన వెదజల్లుతోంది త్వరలోనే డ్రైనేజీ కాలువకి అడ్డుపడిన మట్టిని రాళ్లను తొలగించి మురుగునీటి కాలువలు పునరుద్ధరించి బస్టాండ్ ఆవరణంలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని తొలగిస్తామని సర్పంచ్ సుప్రియ కార్యదర్శి అశ్వత్త నాయుడు తెలిపారు.