May 28,2023 15:00
  • జూన్ 20నుండి పోలవరం ముంపు మండలాలలో జరిగే మాహా పాదయాత్రను జయప్రదం చేయండి 

ప్రజాశక్తి-విఅర్ పురం : ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి ఆజీవనాడికి సర్వం త్యాగాలు చేసిన పొలవరం నిర్వాసితుల ప్యాకేజీ పునరావాసం తో పాటు మొదటి ప్రయార్టీ  గ్రామాల వారికి సర్వేలు చేసి కాంటూరు కాకి లెక్కలు పక్కన పెట్టీ మునిగే ప్రతి గ్రామాన్ని గుర్తించి ఇళ్లకు ప్యాకేజీ అర్ అండ్ అర్ ప్యాకేజీ పునరావాసం ఇవ్వాలనీ సిపిఎం మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో యేర్పాటు చేసిన సమావేశంలో సీపీయం మండల కార్యదర్శి సోయం చినబాబు పాల్గొని మాట్లడారు. జూన్ 20 నుండి రేఖపల్లి నుండి విజయవాడ వరకు మహా పాదయాత్ర ను సిపిఎం అధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహా పాదయాత్ర లో ప్రదానం గా స్టానిక సమస్యలు మేజర్ గా పోలవరం నిర్వాసితుల సమస్యలు పై ప్రభుత్వానికి కనువిప్పు చేసేందుకు పాదయాత్ర ఉంటుందని దీనికి ఊరు వాడ కదిలి జయప్రధం చేయాలని చినబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు పంకు సత్తిబాబు  సోడే మల్లయ్య కుంజా కన్నయ్య వార్డు మెంబర్ కారం పార్వతి సోడే చంద్రారావు తెల్లం పుల్లయ్య సోడే శ్రీరామమూర్తి గ్రామస్థులు పాల్గోన్నారు.