ప్రజాశక్తి - గంపలగూడెం: వృద్ధులు వికలాంగులకు దానం చేస్తే వచ్చే ప్రశాంతత అంతా ఇంత కాదని కనుమూరు గ్రామ సర్పంచ్ మంద మారేశ్వరి తెలిపారు. శనివారం నాడు వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో తిరువూరు ఏఎంసి డైరెక్టర్ వజ్రాల శ్రీనివాసరెడ్డి దంపతుల సారధ్యంలో వందమంది వృద్ధులు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లు అందుకున్న వృద్ధులు, వితంతువులు శ్రీనివాస్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అట్లూరి వెంకట కృష్ణారెడ్డి, పూర్వపు వితరణ దాత అత్తునూరి వెంకట శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గంపలగూడెం మండలంలో పలుచోట్ల ఈ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించి పలు రకాలుగా వితరణలు భావించారు










