Sep 27,2023 16:47

 ప్రజాశక్తి-యు.కొత్తపల్లి :  ఉప్పాడ తీరంలో డాల్ఫిన్ ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. బుధవారం ఉప్పాడ, కాకినాడ  బీచ్ మార్గం మధ్యలో ఉన్న కొత్త వంతెన సమీపతీరం వద్ద డాల్ఫిన్ కొట్టుకువచ్చింది. అరుదుగా లభ్యమయ్యే డాల్ఫిన్ ఉప్పాడ తీరానికి కొట్టుకు రావడంతో డాల్ఫిన్ ను చూసేందుకు తీర ప్రాంత వాసులు వస్తున్నారు