Apr 13,2023 00:02

మున్సిపల్‌ కార్యాలయం

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ :స్థానిక మునిసిపాలి టీలో జనన మరణ ధృవపత్రాలు జారీ చేయాలంటే ఇప్పట్లో పని అయ్యేలా లేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. జనన మరణ ధ్రువపత్రాలు పొందేందుకు అనేక తంటాలు పడుతున్నారు. వినియోగదారుడు జనన మరణ ధ్రువపత్రాలకు మీ సేవలో లేదా సచివాలయంలో నమోదు చేసుకున్న తర్వాత సంబందిత తహశీల్దారు, ఆర్డీవో కార్యాలయానికి వెళుతుంది. అక్కడ పూర్తి పరిశీలన అనంతరం మున్సిపాలిటీకి వస్తుంది. మునిసిపాలిటీ నుండి ఈ పత్రాన్ని వినియోగదారుడు పొందాలి. తహసిల్దార్‌ కార్యాలయం ఆర్డీవో కార్యాలయంలో పూర్తి పరిశీలన అయిపోయినప్పటికీ మున్సిపాలిటీలో ఈ పత్రాలు పొదేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మునిసిపాలిటీలో పరిశీలన అయిన తర్వాత లాగిన్‌లో ఓపెన్‌ అయి ఆ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంది. లాగిన్‌ అవ్వాలంటే సంబంధిత అధికారుల సెల్‌కు ఓటిపి వస్తుంది. ఈ ఓటిపి ద్వారానే లాగిన్‌ అవ్వాలి. ఓటిపి వచ్చే సిమ్‌ కార్డుకు ఈ నెలలో ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించక పోవడంతో ఆ సిమ్‌ కార్డు కాస్త నిలిచి పోయింది. ఇక్కడే అసలైన తంటా ఏర్పడింది. సిమ్‌ కార్డు పని చేయకపోవడంతో ఓటిపి రాకపోవడంతో మునిసిపాలిటీ లాగిన్‌లోని ఆ పత్రాన్ని వినియోగదారుడుకు అందించలేక పోతున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు మున్సిపాలిటీ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. దీంతో వినియోగదారుడు కార్యాలయం చుట్టూ పది రోజుల నుండి తిరుగుతున్నప్పటికీ మరణ దవపత్రాన్ని పొందలేకపోతున్నాడు. పెద్ద బొడ్డేపల్లికి చెందిన రెడ్డి నూకన్న మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు భూమి పంపకాలకై మరణ దవపత్రం అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో పత్రం కొరకు మీ సేవలో నమోదు చేసి అన్ని కార్యాలయాలు చుట్టూ తిరిగి అధికారులతో పూర్తి పరిశీలన చేయించుకున్నప్పటికీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ పత్రాన్ని తీసుకునేందుకు వెళ్ళగా మున్సిపాలిటీ లాగిన్‌ అవటానికి ఓటిపి రాలేదని సిమ్‌ కార్డు పనిచేయలేదని సిమ్‌ కార్డు పనిచేయాలంటే సిమ్‌ కార్డుకు తగినంత బ్యాలెన్స్‌ ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉందని రెడ్డి నూకన్న కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విస్తుపోయారు. ప్రభుత్వం ఎప్పుడు సిమ్‌ కార్డుకు రీఛార్జ్‌ చేస్తుంది. ఓటీపీ ఎప్పుడు వస్తుందో మా ద్రుపత్రాన్ని మేము ఎప్పుడు పొందుతామో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ సిమ్‌ కార్డులను ఎప్పటికి రీఛార్జ్‌ చేస్తుందో ప్రజలకు వినియోగదారులకు దవపత్రాలు తీసుకునే కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితిలో మున్సిపాలిటీ కొట్టు మిట్టాడుతుంది.