సభలో మాట్లాడుతున్న మంత్రి నాగార్జున
ప్రజాశక్తి-కొల్లూరు: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కొల్లూరు మండలం పోతర్లంక గ్రామంలో శనివారం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని, అర్హత కలిగిన వారందరూ దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డి సిహెచ్ రవిబాబు, సర్పంచ్ పరిశ నిర్మల, కొల్లూరు మండల వైస్ ప్రెసిడెంట్ మురాల రాంబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










