ప్రజాశక్తి- బాపట్ల : పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని కోరుతూ ఈనెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య అన్నారు. నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బాపట్లలోని ఉప్పరపాలెం, మూడో వార్డు రాజీవ్ గాంధీ కాలనీ ప్రాంతాల్లో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తే విద్యుత్ వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర,. రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన నిరసన కార్యక్రమానికి ప్రజలు పెద్దఎతున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కష్ణమోహన్ ,నాయకులు కె.నాగేశ్వరరావు ,సుభాషిణి, శరత్, రాజు, వెంక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










