ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ధర్మవరం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలు, పట్టణంలోని వార్డు సచివాలయాలు కూడా ప్లాస్టిక్‌ని సేకరించారు. దాదాపు మూడు గంటల సేపు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గరుండి ప్లాస్టిక్ తూనికలను వేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్‌కు చెందిన బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు అత్యధికంగా 1,093 కేజీలు సేకరించి మొదటి బహుమతిగా 50వేల రూపాయలు, రెండవ బహుమతిగా జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు రూ. 30వేలు, కొత్తపేటలోని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు తృతీయ బహుమతిగా 20 వేల రూపాయలు గెలుచుకున్నారు. ఇక సచివాలయాలలో దుర్గా నగర్ సచివాలయం-2 వారు మొదటి బహుమతిగా 50వేల రూపాయలు, రెండవ బహుమతిగా ఎల్సికేపురం సచివాలయం వారు 30 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 11వ సచివాలయం వారు 20 వేల రూపాయల నగదును ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాసంస్థల ద్వారా మూడు టన్నులు, సచివాలయాల ద్వారా నాలుగున్నర టన్నులు ప్లాస్టిక్ వచ్చిందన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు ప్రజలది, ఇటు అధికారుల ది అని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు వేముల జయరాంరెడ్డి,షేక్ షంషాద్ బేగం, వైసిపి జిల్లాఅధికార ప్రతినిధి గుర్రం శ్రీన, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెనుజురి నాగరాజు, కో ఆప్షన్ నెంబర్లు, పట్టణ వార్డు కౌన్సిలర్లు, పట్టణ వార్డు ఇన్‌ఛార్జులు, మున్సిపల్ మేనేజర్ ఆనంద్, టీపిఆర్వో సుబ్బరాయుడు, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సత్యనారాయణ, డీిఈ వన్నూరు స్వామి, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు మహబూబ్ బాషా, శ్యాంసన్, పార్థసారథి, నాలుగు డివిజన్ల మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.










