ప్రజాశక్తి - మంత్రాలయం
ధర్మ పరిరక్షణే ధ్యేయంగా టిటిడి చర్యలు ఉంటాయని టిటిడి పాలకమండలి సభ్యులు వై.సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం పాత ఊరులోని ఆంజనేయస్వామి దేవాలయంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోమాతతో నగర సంకీర్తన శోభాయాత్ర, గోపూజతో పాటు కుంకుమార్చన గోమాతకు పూజలు చేశారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, ధర్మప్రచార మండలి సభ్యులు పి.సూర్యనారాయణ, ఎన్.భీమిరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు పి.భీమాచార్యులు, అర్చకులు శ్రీరంగం శేషాచార్యులు, మధుసూధనా చార్యులు, భాస్కరా చార్యులు, వెంకటేష్, ప్రవీణ్, రంగయ్య, విశ్రాంత తహశీల్దార్ బాబురావు, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర, గోర్కల్ కృష్ణ, ఎంపిటిసి వెంకటేష్ శెట్టి, కురువ మల్లికార్జున, జనార్ధన్ రెడ్డి, శ్రీశైలం ధర్మకర్తల మండలి సభ్యులు సుజాత శంకర్, విజయమోహనా చార్యులు, శివ కుమార్, ఈరయ్య శెట్టి, తిమ్మయ్య పాల్గొన్నారు.