Nov 17,2023 18:52

టిటిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

ప్రజాశక్తి - నెల్లూరు సిటీ : ముమ్మాటికి ధర్మారెడ్డి టిటిడిఒ ఈఒగా కొనసాగే అర్హతలేదని, ఆయన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, చర్చకు సిద్ధమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాల యంలో శుక్రవారం ఆనం వెంకట రమణారెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ఇఒగా ఉన్న ధర్మారెడ్డి ఢిల్లీ కేంద్రంగా రక్షణ శాఖలో ఎస్టేట్‌ అధికారిగా పనిచేశారన్నారు. ధర్మారెడ్డిది మున్సిపాలిటీలో సర్వేయర్‌ స్థాయి మాత్రమేననిఆయన ఎద్దేవా చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు అన్ని దస్త్రాలతో వస్తే చర్చకు సిద్ధమని ధర్మారెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నాన్నారు. సమయం, వేదిక ఎప్పుడు చెప్పిన తాను సిద్ధమేనన్నారు. చీఫ్‌ సెక్రటరీ స్థాయి తనకుందని ధర్మారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీనియర్‌ ఐఎఎస్‌లకే టిటిడి హోదా అర్హత ఉంటుందని, ఐఎఎస్‌ కానీ ధర్మారెడ్డిని టిటిడి ఈఒగా ఎలా అర్హులని ఆయన ప్రశ్నించారు. ధర్మారెడ్డి కోసం తిరుమలలో ఫేక్‌ పోస్టు సష్టించారన్నారు. టిడిటి ఇఒగా పనిచేసేందుకు ఆయనకు అర్హత లేదన్నారు. తక్షణమే ధర్మారెడ్డిని తొల గించి టిటిడి ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్‌ చేశారు.