Sep 17,2023 22:21

ప్రజాశక్తి-గన్నవరం : నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సూరంపల్లి శివారు రామచంద్రాపురంలో ఆదివారం సిపిఎం నాయకులు ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు బతకడం కష్టంగా మారిందని సిపిఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్ల కార్మికులు కర్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ని, కార్మికుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ప్రజలు పనిచేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో వైసిపి టిడిపిలను ప్రజా సమస్యలపై ప్రశ్నించాలన్నారు. విద్యుత్‌ సరసాజీల పేరుతో పెరిగిన బారాలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బెజవాడ తాతబ్బాయి, సోమిశెట్టి శ్రీనివాసరావు, శ్రీనివాస్‌, కే. ఏసుదాసు, ఆంతోని, రమేష్‌ పాల్గొన్నారు.