ప్రజాశక్తి-యంత్రాంగం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం సమర భేరి మన్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం నేతలు పలు గ్రామాల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు.
పెదబయలురూరల్:మండలంలోని అడుగులపుట్ పంచాయతీ వడ్డేఫుట్ గ్రామంలో సీపీఎం నేతలు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె సురేంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందన్నారు. ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాన్నే శతశాతం అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.నిత్యావసర సరుకులు అధిక ధరలను తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కె.సర్భన్న బి.గంగాధర్, కె.నర్సయ్య రాజు,తదితరులు పాల్గొన్నారు
హుకుంపేట :సిపిఎం సమర భేరి లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస మండలంలోని గడికించుమండ పంచాయతీ గడ్డి మర్రి గ్రామంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.హైమా, నాయకులు కృష్ణారావులతో కలిసి పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటికి తిరిగి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం అప్పలనర్శ మాట్లాడుతూ, బిజెపి, వైసిపి ప్రభుత్వాలను గద్దెదించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణ్ రావు, పడల్, అప్పారావు పాల్గొన్నారు.
పాడేరు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపి దోపిడి చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస ధ్వజమెత్తారు. చింతలవీధి సచివాలయంకు ప్రదర్శనగా వెళ్లి సచివాలయం అధికారికి అర్జీలు సమర్పించారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నర్శ మాట్లాడుతూ, ట్రూ ఆఫ్ చార్జీ, స్మార్ట్ మీటర్ పేరుతో ప్రజలపై భారాన్ని వైసీపి ప్రభుత్వం మోపుతుందన్నారు. అధిక విద్యుత్ బిల్లుల నెపాన్ని చూపి అసర చేయూత పథకం రద్దు చేశారన్నారు. .మినుములురు సచివాలయంలో పార్టీ మండల కార్యదర్శి ఎల్. సుందర రావు మాట్లాడారు.గుత్తుల పుట్టు సచివాలయం వద్ద సిపిఎం మండల నాయకులు కె.సత్యనారాయణ, చిట్టిబాబు మాట్లాడారు.
అరకులోయ రూరల్: మండలలోని పెదలబుడు, పద్మాపురం, మాడగడ, చొంపి, సిరగాం సచివాలయ కేంద్రాల వద్ద కరెంటు బిల్లులను సిపిఎం నేతలు దగ్ధం చేశారు. ఈ సంధర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమమహేశ్వరరావు, నాయకులు పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి కె.రామారావు, జిల్లా కమిటి సభ్యులు వి.విజయ మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెంచుతున్నారని విమర్శించారు. ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె జగన్నాథం, మగ్గన్న, పద్మాపురం ఉప సర్పంచ్ జె భగత్‌రాం, చొంపి వార్డు సభ్యులు కోగేశ్వరరావు, హరి, రాము సహదేవ్, కళ్యాణ్, సత్యారావు, జగనాధం తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు ఆధ్వర్యంలో మండలంలోని అరకు పంచాయతీ సచివాలయ అధికారులకు ఆ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ, జీవో 3కు చట్టబద్ధత తీసుకొచ్చి ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు పి సురేష్ కుమార్, పి ధర్మ, వి సింహాద్రి, పి సారేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: మండలంలోని టోకురు, పైనంపాడు సచివాలయాల వద్ద సిపిఎం నేతలు ధర్నా చేపట్టి అనంతరం సెక్రటరీలకు వినతి పత్రాలు అందజేశారు. సిపిఎం రాష్ట్ర నాయుడు దడల .సుబ్బారావు, స్దానిక జెడ్పిటిసి దీసరి .గంగరాజు మాట్లాడుతూ, జి.ఓ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. పివిటిజిలకు రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలన్నారు. విద్యుత్ చార్జీలు, అధిక ధరలు అరికట్టాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులను గిరిజనులతో భర్తీ చేయాలన్నారు. భాష వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గెమ్మెల దేవన్న సివేరి కొండలరావు, నందల రామరాజు, నరాజీ సురేష్ పాల్గొన్నారు
ముంచింగిపుట్టు:సీపీఎం ఆధ్వర్యంలో సచివాలయల అధికారులకు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు సమర్పించామని మండల కమిటీ సభ్యుడూ ఎం.ఎం.శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్‌ఈ శ్వరి, మురళి కె.నరసయ్య గిరిజనులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాల వద్ద నిరసనలు
చింతూరు:అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు స్పెషల్ డిఎస్‌సి ప్రకటించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని తుమ్మల, కుమ్మురు గ్రామ సచివాలయాల వద్ద శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. అనంతరం ఆయా పంచాయతీల కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వేక రాజ్‌కుమార్ మాట్లాడుతూ జిఒ 3ను పునరుద్ధరించాలని, బోయవాల్సీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చే 52 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముట్టం రాజయ్య, సవలం నారాయణ, సోడే లెనిన్, ముర్రం పిడగయ్య, సురేష్, మడకం శంకర్, వేక గోవిందు, మడకం బ్రహ్మయ్య, కురసం రాములమ్మ, భద్రమ్మ, బొగ్గ వెంకమ్మ, కుంజ హరీష్, లెనిన్ పాల్గొన్నారు.
కూనవరం : మండలంలోని కూనవరం, కూటూరు, చిన్నఆర్కూర్ గ్రామ సచివాలయాల ఎదుట సీపీఎం ఆధ్వర్యాన ధర్నాలు చేపట్టారు. కూనవరం సచివాలయం వద్ద సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీ కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, తెల్లగానే నాగరాజు, వెంకన్న బాబు, జక్కుల వీరబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.
విఆర్.పురం : మండలంలోని ఒడ్డుగూడెం, రేఖపల్లి, రాజుపేట, రామవరం, జీడిగుప్ప, చిన్న మట్టపల్లి గ్రామ సచివాలయాల సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు కాంటూరు కాకి లెక్కలతో సంబంధం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, సర్పంచ్‌లు వెట్టి లక్ష్మి, పులి సంతోష్ కుమార్, పూనెం సరోజిని, సవలం మారయ్య, కారం బుచ్చమ్మ, ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్, మాజీ ఎంపిటిసి గూటాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పంకు సత్తిబాబు, కుంజా నాగిరెడ్డి, వడ్లది రమేష్, కారం సుందరయ్య, గుండెపూడి లక్ష్మణరావు, కాంతారావు, నెరబైన రాజు, తాతబాబురెడ్డి, వాళ్ల కృష్ణారెడ్డి, ఖాదర్‌బాబు, ప్రకాష్‌రావు, నూకరాజు, వీర్ల నాగేశ్వరరావు, చంద్రరావు, రామచంద్ర, పాల్గొన్నారు.
ఎటపాక : మండలంలోని లక్ష్మీపురం, నెల్లిపాక, కన్నాయిగూడెం, గుండాల, గన్నవరం సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ధర్నాలు చేసి, వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఆకిశెట్టి రాము, బేతి మంగయ్య, రాసాల వెంకటేశ్వర్లు, నూతలపాటి సుధాకర్, తోట శ్రీను పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : మండలంలోని లోదొడ్డి, వాతంగి సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, లోదొడ్డి సర్పంచ్ లోతా రామారావు లోదొడ్డి సచివాలయంలో నెల రోజులుగా నెట్ సౌకర్యం లేక పనులన్నీ నిలిచిపోయాయని, సేవలు పునరుద్దించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేలిన రమేష్, జర్త రాజు, గంగరాజు, పి.సత్యనారాయణ, కె.అప్పలరాజు, గోము బుల్లబ్బాయి, మణుగుల రాజు, మేలిన మురళి, శ్రీను, సురేష్, శివ పాల్గొన్నారు.
కొయ్యూరు : మండల కేంద్రంలోని కొయ్యూరు గ్రామ సచివాలయంలో సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎస్ సూరిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.










