ప్రజాశక్తి - బలిజిపేట : పేదలనడ్డి విరచి నిత్యవసర వస్తువుల ధరలు పెంచుకు పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గర పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ ఈనెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాల యంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా రోజు రోజుకు అడ్డూ, ఆపూ లేకుండా నిత్యవసర వస్తువు ధరలు పెంచుకు పోతుందన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజానీకం పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంస్కరణల వల్ల విపరీతంగా కరెంట్ బిల్లులు పెంచుతూ ప్రజల మాడు పగలగొడుతుందని అన్నారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కరువై నిరుద్యోగులు తిరుగుతున్నారని, పేదరికం పెరుగుతుందని, ప్రజలు సమస్యలు పట్టించు కోకుండా మతాలపేరిట మతోన్మాదం రగిలించి దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని విమర్శిం చారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య గొడవలు సృష్టించి అక్కడ ప్రకృతి సంపదను కార్పొరేటర్లు కట్టబెట్టాలని దారుణమైన ఆలోచ నలతో మహిళలను నగంగా ఊరేగించి, భయభ్రాం తులకు గురి చేస్తూ మహిళలకు రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంద న్నారు. కావున ఈ సమస్యలను నిరసిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు జరుగు ప్రచార, నిరసన కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సిపిఎం నాయకులు వి.సత్యనాయుడు. గేదెల సత్యనారాయణ, వై.మన్మధరావు, ఆవు సాంబమూర్తి, గంట్యాడ బలరాం, బొద్దాన భానుమూర్తి, దన్నాన త్రినాధ, పీసా వెంకటస్వామి, యు.లక్ష్మి, యమ్మల మన్మధరావు పాల్గొన్నారు










