Oct 23,2022 23:26

సంతకాలను సేకరిస్తున్న ఐద్వా నేతలు

ప్రజాశక్తి- చింతూరు: నిత్యం పెరుగుతున్న వంటగ్యాస్‌, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు భారంగా మారి సామాన్యుల బతుకును దుర్భరం చేస్తున్నాయని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు ఐ.పద్మ మండిపడ్డారు. ఆదివారం చింతూరు సెంటరులో ధరాభారంపై సంతకాల సేకరణ చేపట్టారు.
ముందుగా చింతూరులో ఐద్వా మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రావడం కోసం సంపూర్ణ మద్యం నిషేధం ప్రకటించిన ఆచరణలో విఫలమైందని విమర్శించారు. ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో మద్యం దుకాణాలను ప్రారంభించారని, రెట్టింపు ధరలకు మద్యాన్ని విక్రయిస్తూమందుబాబలు జేబులను గుళ్ల చేయడంతోపాటు, పేదల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజీల్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదలను కుదేలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ముర్రం రంగమ్మ, మడకం, గిరిజ, కారం అమల, పాండ్రమ్‌ ముత్తమ్మ, పట్రా జయ, చామంతి పాల్గొన్నారు.