Sep 01,2023 22:26

ఫొటో : వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
ప్రజాశక్తి-బిట్రగుంట : నిత్యావసర వస్తువులు ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు రెహనా బేగం పేర్కొన్నారు. శుక్రవారం బోగోలు సిపిఎం కార్యాలయంలో పెరిగిన ధరలకు నిరసనగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ నాలుగో తేదీ వరకు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిరసన ధర్నా వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రెహనా బేగం మండల సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య మాట్లాడుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు బ్రతకలేని పరిస్థితిని తీసుకొచ్చారని పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా రాష్ట్రంలో పెంచడంతో ప్రజలు వలస వెళ్లే పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చారని పెరిగిన ఛార్జీలకు నిరసనగా సిపిఎం, సిపిఐలు చేపడుతున్న ఆల్‌ ది బెస్ట్‌ సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చల్ల నరహరి, ఉపాధ్యక్షుడు ఎస్‌.కె అన్వర్‌ భాషా, విశ్వనాథరావుపేట శాఖ కార్యదర్శి ఎన్‌.రామయ్య తదితరులు పాల్గొన్నారు.