May 08,2022 13:15

చూస్తూనే వున్నా
భరిస్తూనే వున్నా
అన్నార్తుల ఆక్రందనల్ని
రోగార్తుల వేదనల్ని

చూస్తూనే వున్నా
భరిస్తూనే వున్నా
మనుషుల స్వార్థపరత్వాన్ని
నైతిక విలువల పతనాన్ని

చూస్తూనే వున్నా
భరిస్తూనే వున్నా
రాజకీయ ముఠాకక్షల్ని
ఓట్ల పథకాల వంచనాశిల్పాన్ని

చూస్తూనే వున్నా
భరిస్తూనే వున్నా
భౌగోళిక ప్రకృతి అందాల్ని
ధన దాహార్తుల దుశ్చర్యల్ని

చూస్తూనే వున్నా
భరిస్తూనే వున్నా
కత్తులతో కుత్తుకలు కోస్తూ
రాజ్యాల కోసం రణరంగాల్ని

చూస్తూనే వున్నా
భరిస్తూనే వున్నా
మానవతకు గోరీ కట్టకండి
శాంతి కపోతాలు ఎగరేయండి
 

పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162