Sep 16,2023 21:44

ధర్నా నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ధనార్జనే ధ్యేయంగా వైసిపి పాలన : టిడిపి
ప్రజాశక్తి - అవుకు

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలన ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతోందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అవుకు పట్టణంలో రిలే నిరాహార దీక్షలను శనివారం నిర్వహించారు. దీక్షలకు మండలంలోని గ్రామాల నుండి కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించటం తధ్యమని జోస్యం చెప్పారు. దీక్షలకు ఎంహెచ్పిఎస్‌, రాయలసీమ విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించి వైసిపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం టిడిపి సీనియర్‌ నాయకులు ఐవి పకీర రెడ్డి నిమ్మరసం ఇచ్చి బిసి జనార్దన్‌ రెడ్డి దీక్షను విరమింప చేశారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ మండల నాయకులు ఎస్‌ రామకృష్ణారెడ్డి, ఆల్‌ ఇండియా బంజారా సంఘం అధ్యక్షుడు రమణ నాయక్‌, టిడిపి మండల నాయకులు మద్దిలేటి, దంతల రమణ, మురళీకృష్ణ, ఐవి ఉగ్ర సేనారెడ్డి, కాట్రేడ్డి మల్లి కార్జున్రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహానంది : వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మహానందిలోని ఈశ్వర్‌ నగర్‌లో మండల టిడిపి నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బన్ను రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు ఉల్లి మధు, మహానంది ట్రస్ట్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, నాయకులు క్రాంతి యాదవ్‌, అస్లాం భాష, కాకర్ల శివ, శీను పాల్గొన్నారు. నంద్యాల రూరల్‌ : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 4వ రోజు కొనసాగాయి. కాపు సంఘ నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. ఆళ్లగడ్డ : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ ఆధ్వర్యంలో బాబుకు అండగా మేము సైతం అంటూ జరిగిన దీక్షలలో రుద్రవరం టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు ముత్తలూరు రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు పోలా గురుమూర్తి, లక్ష్మీకాంత్‌ యాదవ్‌, మాజీ ఎంపీటీసీ సత్యం రాజు, అల్లాడి శేఖర్‌, డీలర్‌ నరసింహారెడ్డి, సత్యనారా యణ పాల్గొన్నారు.
కక్షతో సాధింపుతో చంద్రబాబుపై అక్రమ కేసు : మాజీ ఎమ్మెల్యే
బనగానపల్లె : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కక్ష సాధింపుతో చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి పెట్రోల్‌ బంకు కూడలి వరకు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చంద్రబాబుపై అక్రమ కేసుకు నిరసనగా నాయకులు కార్యకర్తలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పెట్రోల్‌ బంకు కూడలిలో ధర్నా నిర్వహించారు. టిడిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ నాయక్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బొబ్బల గోపాల్‌ రెడ్డి, పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌ ,పాతపాడు సర్పంచ్‌ బెడదల మహేశ్వరరెడ్డి, నాయకులు కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, రాయలసీమ సలాం, అన్వర్‌ సాహెబ్‌, టిప్‌ టాప్‌ కలాం, నందవరం వెంగన్న పాల్గొన్నారు. ఆత్మకూరు : ఆత్మకూరులో టీడీపీ నేతలు నాలుగవ రోజు రిలే దీక్షలను కొనసాగించారు. ఈ సందర్భంగా సీనియర్‌ టిడిపి నాయకులు మాజీ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, సీనియర్‌ న్యాయవాది, మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవింద రెడ్డిలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై కక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్‌, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్‌ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్‌ నాయకులు నాఘుర్‌ ఖాన్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 3వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షల్లో నందికొట్కూరు నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి జయసూర్య, టిడిపి అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, అబ్జర్వర్‌ దేవల్ల మురళి,భాస్కర్‌ రెడ్డి, ముత్తు జావలి, షకిల్‌ అహ్మద్‌, లాయర్‌ జాకీర్‌ హుస్సేన్‌, పలుచాని మహేశ్వర్‌ రెడ్డి, ఓబుల్‌ రెడ్డి, గిరీశ్వర్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, గని, గోవర్ధనగిరి, నిమ్మకాయల రాజు, కళాకర్‌ ప్రభు కుమార్‌ ,బ్రహ్మయ్య, శ్రీనివాసులు, మాసుము, రవి చౌదరి, ప్రవీణ్‌ రగడ, పాలమారి నాగరాజు, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.