ప్రభుత్వ డైట్, కస్తూర్బాల సందర్శన
ప్రజాశక్తి -భీమునిపట్నం : డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ సభ్యుల బృందం స్టడీ టూర్‌లో భాగంగా, శనివారం స్థానిక ప్రభుత్వ డైట్, కస్తూర్బా పాఠశాలలను సందర్శించారు. ఢిల్లీ ఎస్‌సిఇఆర్‌టి ప్రిన్సిపల్ శ్రీరామ్ కిషోర్, రును చౌదరి, వైస్ ప్రిన్సిపల్ సునీత మిట్టల్ నేతృత్వంలోని బృందానికి ఎపిలో అమలవుతున్న విద్యావిధానాన్ని పిపిటి ద్వారా డైట్ ప్రిన్సిపల్ యు మాణిక్యంనాయుడు వివరించారు.పరస్పర స్టడీ టూర్లతో పాఠశాల నిర్వహణ, బోధనాసామర్థ్యం మెరుగుకు దోహదపడతాయని విద్యాశాఖ ఎం.జ్యోతి కుమారి అన్నారు. డైట్‌లో విద్యావిధానం, శిక్షణ తరగతులు, ఇతర కార్యక్రమాలపై ఢిల్లీ బృందానికి డైట్ అధ్యాపకులు వివరించారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో అమలవుతున్న దేశభక్తి, హ్యాపీ కరికులం గురించి స్థానిక అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఆతిథ్య బృందం వివరించింది. కార్యక్రమంలో డిఇఒ ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఎపిసి బి శ్రీనివాసరావు, డిప్యూటీ డిఇఒ ఎ.గౌరీశంకరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఢిల్లీ బృందంలోని సభ్యులను డైట్, కెజిబివిల్లో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.










