ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు
- కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వైయస్సార్ సెంటనరీ హాలులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహౌన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, డిఇఒ అనురాధ, పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం : రుద్రవరం ఆదర్శ పాఠశాలలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. సిరివెళ్ల : మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ షేక్ మొహిద్దిన్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్‌ఐ సుచరిత, విఆర్వోలు పాల్గొన్నారు. మహానంది : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ జనార్ధన్ శెట్టి, డిప్యూటీ తహశీల్దార్ నారాయణరెడ్డి, స్పెషల్ డిటి కామేశ్వర రెడ్డి తదితరులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్‌ఐ శ్రీకాంత్, వీఆర్వో శివ ప్రసాద్ పాల్గొన్నారు. గోస్పాడు : గోస్పాడులోని గ్రంధాలయంలో గ్రంథాలయం అధికారి వజ్రాల భవాని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. ప్రధానోపాధ్యాయులు కళా సుభాషిని తదితరులు పాల్గొన్నారు. (మిగతా 6వ పేజీలో...)










