రాయచోటి : నేతలు మారినా తమ రాతలు మారలేదంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'ఎవరో వస్తారు ఏదో చేస్తారంటూ ఎదురు చూసి మోసపోకుమా' అనే సామెత ప్రకారం ప్రభుత్వాలు మారుతున్న కానీ మత్స్య కారుల జీవనం.. వారికి ప్రభుత్వ పథకాలు అంతంత మాత్రంగానే అందు తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గంగపుత్రులకు ఆదుకుంటున్నామని పేపర్లకే ప్రకటనలు చేస్తుందే తప్ప చేతల్లో చూపిన దాఖలాలు లేవంటూ మత్స్య కారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో 144 చెరువులు, 5 ప్రాజెక్టులు, దాదాపు 835 మత్సకారులున్నారు. ఇటీవల కొంతకాలంగా వర్షాలు లేకపో వడంతో ఉన్న చెరువులన్నీ ఎండిపోవడంతో మత్స్యకారుల జీవనం దుర్బరంగా మారింది. ప్రభుత్వం మత్స్యకారులకు వలలు, పడవలు, పెన్షన్లు ఇచ్చి ఆదుకుం టామని ప్రకటనలు మాత్రం గుప్పిస్తోంది. వాస్తవంగా అందుకు పూర్తిగా ఉంది. జిల్లాలోని పలు చెరువులు నీరు లేకపోవడంతో కబ్జాకు గురవుతున్నాయి. ఇక చిన్న చిన్న ప్రాజెక్టుల్లోనూ అంతంత మాత్రమే నీరు ఉండడంతో అక్కడ చేపలు పట్టుకొని జీవనం సాగించే వారిపై అధికారులు కొరడా చిలిపిస్తూ కేసులు పెట్టడంతో వారి పరిస్థితి మరి దయనీయంగా మారింది.
బయట ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మార్కెట్లోకి చేపలు రావడంతో ప్రజలు వాటిపై మొగ్గు చూపుతుండంతో స్థానిక మత్సకారులు పట్టిన చేపలకు డిమాండ్ తగ్గింది. పైగా వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో మత్స్యకారులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి లబ్ది చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధితాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యశాఖ కారులకు వలలు, పడవలు ఇతర పరికరాలు ఉచితంగా సరఫరా చేయాలి. ప్రతి ఒక్కరికి చేపలు ఇన్సూరెన్స్ కార్డులను మంజూరు చేయాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో చేపలు మార్కెట్ ను ఏర్పాటు చేయాలి. పెన్షన్ కూడా మంజూరు చేయాలి.
- వేణుగోపాల్, మత్స్యకారుడు, రాయచోటి.
లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలి
చేపలు పట్టే వారు లైసెన్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి .రాష్ట్ర ప్రభుత్వం చేపల మార్కెటింగ్ షాపులకు ఎస్సీ, ఎస్టీ , మహిళ కు 60 శాతం, బీసీకి 40 శాతం సబ్సిడీతో రూ. లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు మంజూరు చేస్తుంది. చేపల అమ్మకదారులకు వాహనాలు కూడా ద్విచక్రవానం, మూడు చక్రాల వాహనం, నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు ఎస్సీ, ఎస్టీకి 60 శాతం, బీసీకి 40 శాతం సబ్సిడీతో అందజేస్తున్నాం. మండల, స్థాయి గ్రామ సచివాలయం సిబ్బందితో మత్స్య కారులకు పలు సూచనలు,సలహాలు కూడా అందజేస్తున్నాం.
- ఎన్.సుస్మిత, జిల్లా మత్స్యశాఖ అధికారి, రాయచోటి.










