శ్రీరైతులు ఆందోళన చెందొద్దు
శ్రీ ఆర్‌బికెల ద్వారా వేగవంతంగా చర్యలు
శ్రీఅర్హత మేరకు ఇన్‌పుట్ సబ్సిడీ,
పంటల బీమా అందేలా చర్యలు
ప్రజాశక్తి -కరప
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశామని, రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ కృతికాశుక్లా భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆమె కరప మండలంలో పర్యటించారు. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశిం చారు. కరప ఆర్‌బికెను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం భీమన్న కర్ర కాలువను పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 65 వేల హెక్టార్లలో వరి సాగు జరిగిందని.. ఇందులో 50 శాతం మేర కోతలు పూర్తయినట్లు తెలిపారు. బొండాలు రకం ధాన్యానికి వర్షాల వల్ల నష్టం జరగలేదన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్‌బికెల ద్వారా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయను న్నట్టు స్పష్టం చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి, పంట నష్టాలను అంచనా వేస్తామన్నారు.ఆమె వెంట జిల్లా వ్యవసాయ శాఖ జెడి ఎన్.విజరు కుమార్, పౌర సరఫరాల డీఎం డి.పుష్పమణి, కరప మండల తహశీల్దార్ పి.శ్రీనివాస రావు, ఎంపిడిఒ కె.స్వప్న, ఇతర అధికారులు ఉన్నారు.
శ్రీకాలువల పనులు పూర్తిచేయాలి
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి పొలాల్లో నీరు నిలిచిపోకుండా డ్రెయిన్ల ద్వారా సాఫీగా బయటకు వెళ్లిపోయేలా కాలువ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జెసి ఎస్.ఇలాక్కియాతో కలిసి వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్ కోర్టుహాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రైతులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరక్కూడ దన్నారు. వర్షాలు ఆగిన వెంటనే నష్టాలపై సర్వేచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి న్.విజరు కుమార్, పౌర సరఫరాల డిఎం డి.పుష్పమణి, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ పాల్గొన్నారు.
కరపలో ధాన్యం రాశులను పరిశీలిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లాc










