ప్రజాశక్తి - కైకలూరు రూరల్
ధాన్యం రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణ కోరారు. మండలంలోని తామరకొల్లులో వరి పొలాల్లో కోసిన వరి పనలను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పి.రాధాకృష్ణ, ఎంపిటిసి సభ్యులు గంగుల వెంకట నరసమ్మ, పోతురాజు, పావులూరి ప్రతాప్, బోయిన గోవిందరాజు, రైతులు పాల్గొన్నారు.










