
ప్రజాశక్తి - పాచిపెంట : స్థానిక వ్యవసాయ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుకు, సాంకేతిక సహాయ కులకు సివిల్ సప్లైస్ ద్వారా ధాన్యం కొనుగోలుపై సోమవారం శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతి రావు మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకువెళ్లే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జిపిఎస్ అమర్చాలని, సొంత వాహనాల్లో ధాన్యం తరలించదల్చుకున్న రైతులు తమ వాహనాలకు జిపిఎస్‌లను అమర్చుకొని ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిం చారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న రైతులంతా ఆర్‌బికెల్లో ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకొని బయోమెట్రిక్ వేసుకోవాలని తెలిపారు. సివిల్ సప్లై సాంకేతిక శిక్షకులు రాజశేఖర్ ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను, నాణ్యత ప్రమాణాలను వివరించారు. అనంతరం సివిల్ సప్లై అసిస్టెంట్ కళ్యాణ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, సాంకేతిక శిక్షకులకు ధాన్యాన్ని తరలించేలా వాహనాల రిజిస్ట్రేషన్ రైతులకు ధాన్యం బస్తాల పంపిణీ చేసే విధానాన్ని కంప్యూటర్ ద్వారా వివరించారు. సాంకేతిక శిక్షకులు జి.వనిత ధాన్యం సేకరణ పద్ధతి నాణ్యతా ప్రమాణాలను గుర్తించే విధానం, తేమ యంత్రం ద్వారా ప్రేమ శాతాన్ని కొలిచే విధానాన్ని చూపించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని పెదబోగిల గ్రామ రైతు భరోసా కేంద్రంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలకు సంబందించి ఎఒ అధ్యక్షతన గ్రామ వ్యవసాయ సహాయకులకు, టెక్నికల్ అసిస్టెంట్లకు సోమవారం శిక్షణ ఇచ్చారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రశాంతి ధాన్యం కొనుగోలకు సంభందిచిన ప్రక్రియను వివరించారు. సాధారణ రకం ధాన్యం ఒక క్వింటాలకు రూ.2183, గ్రేడ్ - ఏ ధాన్యం రూ.2203లకు కొనుగోలు చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలలో ముఖ్యంగా తేమ శాతం కచ్చితంగా 17శాతం కంటే తక్కువగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.