ప్రజాశక్తి-సామర్లకోట రూరల్
మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి.శ్రీలలిత, తహశీల్దార్ లక్ష్మీ నరసకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయంలో మిల్లర్లతో ధాన్యం సేకరణ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. మిల్లర్లు నష్ట పోకుండా, రైతులకు అనుకూలంగా ప్రభుత్వ సూచనలను అనుసరించి సహకరించాలని సూచించారు. ధాన్యం బ్రోకెన్ శాతం 30 శాతం దాటితే తప్ప ఎవ్వరికి తగ్గుదల లేకుండా చూడ వలసిందిగా కోరారు. మిల్లు వద్దకు వచ్చిన పంటని త్వరి తగతిన బాయిల్డు రైసు కోసం అప్‌లోడ్ చేయాలని, కటింగ్ చేసి నేరుగా పంపిన పంటని ఎటువంటి కోత లేకుండా తీసుకోవలసినదిగా అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎడిఎలు జివి పద్మశ్రీ, ప్రత్యేకా ధికారి పివసంతమాధవతి, ఎఒ ఇమ్మిడిశెట్టి సత్య, ఐ.సత్య, మండల పరిధిలోని మిల్లర్లు, విఆర్‌ఒలు హాజరయ్యారు.
మిల్లర్లతో సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు










