ప్రజాశక్తి-అమలాపురం
ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కల్పించడంతో పాటుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికల తో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు జిల్లా ప్రొక్యూ ర్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఖరీఫ్ సీజన్లో ధాన్యం సాగు విస్తీర్ణం దిగుబడులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ,ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 384 ఆర్‌బికెలల పరిధిలో సుమారుగా 1,58,000 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట ఇ-క్రాప్ బుకింగ్ నమోదయిం దన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి దళారీల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు పారదర్శకంగా మద్దతు ధరను కల్పించాలన్నారు. రైతులు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఉన్నతాధికారులకు చెప్పేందుకు కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు అవసరమైన గోనే సంచులను ముందస్తుగానే సరఫరా చేయా లన్నారు. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే క్రమంలో హమాలీ, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ ఖర్చును రైతు పెట్టుకుంటే నేరుగా ఆ రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. రైతుల నుంచి మిలర్స్ కు ధాన్యం సరఫరా చేసే ప్రక్రియలో తప్పనిసరిగా వాహనాలకు జిపిఎస్ విధానం ఏర్పాటు చేయాలన్నారు. పంట కోత సమయం, వరి నూర్పుళ్లు సమయాల ను అంచనా వేసి వారం రోజులు ముందుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించా లన్నారు. జిల్లా జెసి ఎస్.నుపూర్ అజరు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పూర్తి స్థాయిలో మద్దతు ధరను కల్పించా లని ఆదేశించారు. రైతులు నుంచి ధాన్యం కొనుగోలులో అధికారులు గత అనుభవాలను దష్టిలో ఉంచు కొని సమన్వయంతో సమర్థవంతం గా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారుల ను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే గోనెసంచులను సేకరించి ఆయా ఆర్‌బికెల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ముందస్తుగా అందించనున్నట్లు తెలిపారు. ఆ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ఆర్‌బికె వరకు, తదుపరి మిల్లింగ్ వెళ్ళే విధానం పై అవగాహన కల్పించి ప్రక్రియను విజయవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎస్ సుధా సాగర్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణారావు, జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్‌రావు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ టి.నాగలక్ష్మి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సహాయసంచాలకులుకె.విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.










