Dec 26,2022 23:41

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్‌ లక్ష్మి, ఎంపిటిసి ప్రదీప్‌కుమార్‌

ప్రజాశక్తి-విఆర్‌.పురం
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పెదమట్టపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆ పంచాయతీ సర్పంచ్‌ వెట్టి లక్ష్మి, ఎంపిటిసి పూనెం ప్రదీప్‌ కుమార్‌ ప్రారంభించారు. అనంతరం రైతులకు గోనె సంచులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5000 వేల గోనె సంచులు వచ్చాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరిస్తున్న ధాన్యం కొనుగోలులో ఎక్కడా రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖాధికారి రఘుకుమార్‌, అగ్రికల్చర్‌ సిబ్బంది తేజ, నాగు, రామారావు, రైతులు పాల్గొన్నారు.