Jan 04,2023 23:57

ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి -నక్కపల్లి :మండలంలోని వేంపాడు రైతు భరోసా వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళారులు, మధ్యవర్తుల వద్ద రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకుని రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకు నేందుకు సీఎం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గతంలో మును పెన్నడూ లేని విధంగా రైతులకు సేవలు అందించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిక్కాల రామారావు, పిఎసిఎస్‌ పర్సన్‌ ఇన్చార్జ్‌ సూరకాసుల రామలక్ష్మి, సూరకాసుల గోవింద్‌, బొల్లం బాబ్జి, నరసింహమూర్తి, చందర్రావు, వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.