ప్రజాశక్తి- సబ్బవరం : సబ్బవరం క్లస్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది, దళారుల బెడద లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మంచి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు మాట్లాడుతూ సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.2040, గ్రేడ్- ఎ రకం క్వింటాకు రూ.2060 మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రాప్‌లో నమోదైన రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, జెడ్పీ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, పిఎసిఎస్ చైర్మన్ కాపుశెట్టి శేషుబాబు, వైస్ ఎంపీపీలు శరగడం ఝాన్సీ లక్ష్మీరాణి, చొక్కాకుల గోవింద్, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, ఎంపీడీవో రమేష్ నాయుడు, తహసీల్దార్ బి. సత్యనారాయణ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ విరోతి చినఅప్పల నాయుడు, వైసిపి నాయకులు బోకం రామునాయుడు, కోటాన రాము, సబ్బవరపు నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, పిఎసిఎస్ కార్యదర్శి జి.రమణ పాల్గొన్నారు.










