ప్రజాశక్తి - చింతలపూడి
దళారులు, మధ్యవర్తులు, మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకుండా, మోసాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా అన్నారు. పట్టణంలో ఎఎంసి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రైతు కూడా తన పంటను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదన్నారు. తేమ శాతం లేదని, భ్రమలు పడవద్దని, రైతులకు, మిల్లర్లకు సంబంధం లేదని చెప్పారు. రైతులు అధైర్యపడవద్దని ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. 20 రోజుల్లో రైతులకు తమ ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. సాధారణ రకం వంద కేజీలు రూ.2040 గ్రేడ్ ఎ రకం రూ.2060 అని తెలిపారు. సొసైటీల వద్ద గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాంబాబు, జెడ్‌పిటిసి సభ్యులు మోలుగుమాటి నీరజసుధాకర్, ఎఎంసి ఛైర్మన్ జగ్గ వరపు జానకిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ ఆత్కూరి సుబ్బారావు, అలవల బాబు, కొప్పుల నాగు, మిర్యాల దిలిప్, వెంపాకృష్ణ పాల్గొన్నారు.










