Jan 25,2023 23:55

మాట్లాడుతున్న నేతలు

ప్రజాశక్తి -కోటవురట్ల:ఖరీఫ్‌ సీజన్లో పండిన ధాన్యం నేటికీ సక్రమంగా కొనుగోలు చేపట్టక పోవడంపై టీడీపీ మండల అధ్యక్షులు జానకి శ్రీను, కోటవురట్ల ఎంపీటీసీ సభ్యులు పి.సూర్యారావులు తహసిల్దార్‌ జానకమ్మను ప్రశ్నించారు. పంట చేతికి అంది రెండు నెలలు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్ట లేదని, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఎవరు పట్టించుకోలేదని ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కొడవటిపూడి ఎంపిటిసి సూర్యప్రకాష్‌, తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు పాల్గొన్నారు.