ప్రజాశక్తి- చింతూరు
హొహొ హొరైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ హొసిపిఎం ఆధ్వర్యాన మండలంలోని పేగ సచివాలయం వద్ద సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. పేగ పంచాయతీ పరిధిలోని రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్, నాయకులు కుంజ సీతారామయ్య, పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మల్లం సుబ్బమ్మ, సోలం కన్నయ్య తదితరులు పేగ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఆశగా ఎదురు చూశామని, కాని ప్రభుత్వం, అధికారులు తమను మోసం చేశారని రైతులను వాపోయారు. దీంతో సిపిఎం ఆధ్వర్యాన పేగ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనికి స్పందించిన ఆయన రైతుల సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వాగ్దానం మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, రైతును రాజుగా తీర్చిదిద్దుతానని ఎన్నికల వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కనీసం వరి ధాన్యాన్ని కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. హొతక్షణమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుంటే చింతూరు ఐటీడీఏ కేంద్రాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేగ రైతులు కంగాల రంగయ్య, కంగాల చంటి, కంగాల ముఖేష్ ప్రసాద్, మడివి రామయ్య, సోడా సంకూర్, మడకం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
హొహొ హొ
ప్రజాశక్తి- చింతూరు










