Feb 08,2023 23:42

మిల్లు దగ్గర నిరసన తెలుపుతున్న రైతులు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని ఉమాక పంచాయతీ మనబాలవానిపాలెం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రైస్‌ మిల్లులో రైతు భరోసా కేంద్రాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని నిర్వాహకుడు తీసుకోవడం లేదంటూ నక్కపలి,్ల ఎలమంచిలి మండలాలకు చెందిన పలువురు రైతులు బుధవారం రాత్రి మిల్లు వద్ద నిరసన తెలిపారు. అధికారులు ధాన్యం నాణ్యత చూసి పంపిస్తే రైస్‌ మిల్లు నిర్వాహకుడు ధాన్యం తేడా ఉందని సరకు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు మిల్లు నిర్వాహకుడుకు చెప్పినా పట్టించుకోలేదని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నారాయణరావు, ములినాయుడు, సత్యనారా యణ, నాగేశ్వరరావు, రమణ, బాబు, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.