ప్రజాశక్తి-నందిగామ
రైతుల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ గత 45 రోజులుగా ధాన్యం బకాయిలు రైతుల ఖాతాలలో జమ చేయడం లేదన్నారు. ఎన్టిఆర్ జిల్లా వ్యాప్తంగా 130 కోట్ల బకాయిలు ఉన్నాయని, నందిగామ డివిజనల్ పరిధిలో రూ.70 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కూడా నిలుపుదల చేశారని తెలిపారు. రవాణా, కాటా కూలి చార్జీలు చెల్లించడం లేదన్నారు. ధాన్యం తోలిన 21 రోజులలో డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేస్తానన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. అనంతరం ఆర్డిఓ రవీంధ్రరావుకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు యర్రా శ్రీనివాసరావు, కమతం పుల్లారావు, కౌలు రైతుల సంఘం నాయకులు సందె పోగు లింగయ్య, వ్యకాస నాయకులు సయ్యద్ ఖాసిం, సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే గోపాల్ పాల్గొన్నారు.










