ప్రజాశక్తి - తాళ్లరేవు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్, వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు మండలంలోని పలు రైతు భరోసా కేంద్రాలను వీరు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పి.మల్లవరం పంచాయతీలో పొలాల మీద ఉన్న ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో రైతుల వద్దకు ఏ ఒక్క అధికారీ రాలేదని రైతులు తెలిపారని వీరన్నారు. ఇప్పటికైనా ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న ఆర్‌బికె కేంద్రాల్లో ఉన్న సిబ్బంది రైతులు వద్దకు వెళ్లి వారి వద్ద సిద్దంగా ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.










