ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, మాంబేడు పంచాయతీ, దుద్దే రామా నాయుడు కండ్రిగ, సమీపంలో గల అరుణగిరిపై వెలసిన కొండ మల్లేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారిని పూలతో సుందరంగా అలంకరించి, వేద మంత్రాలతో వచ్చిన భక్తులకు దర్శనం కల్పించి, ప్రసాదాలను అందించారు. ఉభయ దారులుగా మాంబేడు గ్రామంకు చెందిన బోడిరెడ్డి.రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, తిరుపతి, అక్కారంపల్లికి చెందిన ఎ.దీపిక, ఎ.కేశవులు రెడ్డి . శివనామ సంకీర్తన, అన్నమయ్య సంకీర్తనలతో ఆరు నగిరి క్షేత్రం హోరెత్తించింది. వచ్చిన భక్తులకు ఈ కుటుంబంల వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.










