
రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జి.కొండూరు పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఉమాపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమా హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా జైలు నుంచి విడుదలయ్యారు.