
భీమడోలు (పశ్చిమ గోదావరి) : రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలై భారీ కాన్వాయ్‌తో విజయవాడకు వస్తున్న మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే రహదారికి అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి దేవినేని ఉమా, టిడిపి నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను నిలిపివేశారు. దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును మాత్రమే పంపి మిగిలిన వాహనాలను పంపకపోవడంతో ఉమా, పట్టాభి, ఇతర నేతలు అక్కడే నిరసనకు దిగారు. దీంతో భీమడోలులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నేతల నిరసనతో భీమడోలు రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.