
అమరావతి: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమకు బెయిల్ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.