ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పురపాలక సంఘం పట్టణ అభివృద్ధిలో భాగంగా 14వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, 10 లక్షల వ్యయంతో సిసి డ్రైనేజీ నిర్మాణాలకు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు శనివారం శంకుస్థాపన చేశారు. 14వ వార్డులో అనేకమంది లాయర్లు నివాసం ఉంటున్న స్ట్రీట్ ను లాయర్లు లాయర్స్ స్ట్రీట్గా నామకరణం చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జయరామ్ ఏపిపి రంగారావు, ఏజీపీ మట్ట ప్రసాద్, మున్సిపల్ లాయర్ పింగళి నరసింహారావు, ఏ ఈ ఫణి శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తాన్, కో ఆప్షన్ సభ్యులు దాస్, అచ్చి చిన్నబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, వార్డులో ప్రజలు పాల్గొన్నారు.










