Oct 29,2022 15:36

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో  విద్యార్థులకు విద్యాబోధన  మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహె  శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి రంపచోడవరం గిరిజన బాలుర వసతి గృహంను డిడి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వసతిగృహంలో విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు వండిపెడుతున్నది లేనిది ఆరాతీశారు,మెనో ఏ విధంగా అమలు చేస్తున్నది వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నవి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్  ఆదేశాల మేరకు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే వారి ఆధ్వర్యంలో వసతి గృహంలో రాత్రి బస చేయడం జరిగిందని ఆయన తెలిపారు, ఏజెన్సీలోని అన్ని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెనూ,విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన తదితర అంశాలపై  ఆశ్రమ పాఠశాలలో రాత్రి బసలు చేయడం జరుగుతుందని  ఆయన తెలిపారు,ఈకార్యక్రమంలో పలువురు శిబ్బంది పాల్గొన్నారు.