Nov 30,2022 16:38

ప్రజాశక్తి-గణపవరం : రైతుల వద్ద నుండి కొనుగోలు చేసే ధాన్యం 17% తేమ ఉంటేనే కొనుగోలు చేయాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్ పౌరసరఫరాల శాఖ ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల ఇన్చార్జి బి బాలకృష్ణ అన్నారు. బుధవారం గణపవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లుల్ని సొసైటీలను ధాన్యాల ప్రక్రియ పై పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు రైతులతో నమ్రతగా మాట్లాడాలని అన్నారు ఇప్పటివరకు మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట గణప వరం తాసిల్దార్ ఎం సన్యాసిరావు సొసైటీ కార్యదర్శి మద్దాల నారాయణ విఆర్వోలు ఉన్నారు.