Jan 09,2023 16:51
  •   రెవిన్యూ అధికారినికి వినతి సీపీఎం

ప్రజాశక్తి-పెడబయలు : జివో నంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని సోమవారం స్తానిక సీపీఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు  బోండా సాన్నిబాబు కిళ్లో సరబన్నలు స్థానిక రెవిన్యూ జూనియర్ అసిస్టెంట్ శాంతి కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సన్నీబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ నంబర్ 1వెంటనే రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ మధ్యకాలంలో జి ఓ నంబర్ 1తీసుకు వచ్చి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు ర్యాలీలు రాస్తారోకోలు మానవహారాలు ప్రచారాలు ఆందోళనలు సభలు సమావేశాలు నిర్వహించ రాదని వెల్లడించడం. గొంతు నొక్కడ మే అన్నారు. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కావాలని సీపీఎం పార్టీ అల్లూరీ జిల్లా కమిటీ పిలుపు నిచ్చింది. జిల్లా కమిటీ పిలుపు మేరకు కమిటీ అధ్వర్యంలో స్థానిక తహశీ్దార్  రీ సర్వే నిమిత్తం శీకరీ పంచాయతి కి వెళ్లి ఉండగా సంబంధిత రెవిన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి కొమ్మ పృధ్వీ రాజ్ మాట్లాడుతూ ప్రజా సామ్య దేశంలో సభలు సమావేశాలు జరుపుకొనే హక్కు దేశంలో ప్రతి పౌరుడికి ఉందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం దారుణమన్నారు ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని చీకటి జి o నంబర్ వన్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు సీపీఎం వైస్ ప్రెసిడెంట్ బోండా గంగాధర మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.