ప్రజాశక్తి-నార్పల :' భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నార్పల మండల సమితి ఆధ్వర్యంలో మేజర్ పంచాయతీ నందు సిపిఐ కాలనీలో దాదాపుగా ఎనిమిది నెలల క్రితం నుండి విద్యుత్ అధికారులు స్తంభాలు మాత్రమే ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి లైన్లో గాని ట్రాన్స్ఫార్మర్ గాని ఏర్పాటు చేయలేదని నార్పల తాసిల్దార్ కి అర్జీ ఇవ్వడం జరిగింది విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి నార్పల సిపిఐ కాలనీలో కరెంటు స్తంభాలకు వెంటనే విద్యుత్ వైర్లు లాగి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమం నందు సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ సహాయ కార్యదర్శి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య, నారాయణప్ప, సుధాకర్, శీన తదితరులు పాల్గొన్నారు.










