ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీ పడమర సమీపములో వున్న కామ్రేడ్ జక్కా వెంకయ్య శ్రామిక నగర్ లో సుమారు 25 సంవత్సరాల నుండి కాపురాలు ఉంటున్న నిరుపేద 52 కుటుంబాలకు సంబంధించిన హరిజన, గిరిజన, బి.సి.లు కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అని సోమవారం జరిగిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో గూడూరు ఆర్డీవో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇంతవరకు పక్కా గృహాలకు నోచుకోలేదని పైగా డ్రైనేజీ కాలువలు వీధి రోడ్లు లైట్లు వంటి సరైన సౌకర్యాలు లేనందున వారు రాత్రి వేళల్లో విషాసర్పాల మధ్యలో కాలం నెట్టుకొస్తున్నారు. వర్షాకాలం వస్తే ముందు కామ్రేడ్ జక్కా వెంకయ్య శ్రామిక నగర్ వరదనీడితో మురిగిపోతుంది. ఈ విషయాన్ని సచివాలయ సిబ్బందికి, తాసిల్దార్ కి,గూడూరు మున్సిపల్ కమిషనరకి మన శాసనసభ్యులు,కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతూ ఉంది. వాళ్లు నీటమునిగి ఉన్నప్పుడు వచ్చి చూచి బాధితులను పరార్శించి అనంతరం వాళ్లకి ఎటువంటి సదుపాయాలు చేకూర్చుక, హామీలు ఇచ్చి వెళ్లిపోతుండడంతో, ఆ కాలనీవాసులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎదురుచూస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వచ్చి మా యందు దయ చూపి మా జక్క వెంకయ్య శ్రామిక నగర్లో 52 కుటుంబాలకు వసతులు కల్పించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. పార్టీ గూడూరు సెంటర్ శాఖ కార్యదర్శి జోగి. శివకుమార్, తిరుపతి జిల్లా ఆటో సంఘం నాయకులు బి.వి.రమణయ్య, కె.వి.పి.ఎస్. నాయకులు అడపాల. ప్రసాద్, కె.సురేష్ , అక్కడ కాపురాలు నివసిస్తున్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంబంధిత అధికారులకు జక్కా వెంకయ్య శ్రామిక నగర్ సమస్యలు చెప్పుకొని స్పందించడం వలసినదిగా కోరడమైనది.










